Summer Effect : నేడు ఎండలు అదిరిపోతాయట
ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది
ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. వేడిగాలులు వీచే అవకాశముందని ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. అనేక జిల్లాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటడంతో పాటు వేడి గాలులు కూడా వీస్తుండంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
56 మండలాల్లో...
ఈరోజు 56 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 174 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు బయటకు వస్తే ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని లేకుంటే వడదెబ్బ తగిలే అవకాశముందని హెచ్చరించారు. వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఎక్కువగా మజ్జిగ, నీళ్లు తాగుతూ డీహైడ్రేషన్ కు గురి కాకుండా చూసుకోవాలని పేర్కొంది.