Weather Report : ఆంధ్రప్రదేశ్ కు మరో తుపాను ముప్పు
ఆంధ్రప్రదేశ్ కు మరో తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ కు మరో తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 14వ తేదీ నుంచి16వ తేదీ మధ్యలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. దక్షిణ బంగాళాఖాతంలో రేపటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శఆఖ తెలిపింది. ఇది అనంతరం పశ్చిమ దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుందని తెలిపింది. ఇది తీవ్ర వాయుగుండగా మారి తుపాను గా మారుతుందని అంచనా వేస్తుంది. ఈ నెల 17వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోనే తీరందాటే అవకాశముందని తెలిపింది. తుపాను ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు ధ్యలో ఈ నెల 15 నాటికి తీరం దాటే అవకాశముందని తెలిపింది.
ఈ ప్రభావంతో...
అయితే దీనిపై ఇప్పుడే స్పష్టత రాదని, అల్పపీడనం ఏర్పడిన తర్వాత మాత్రమే తెలుస్తుందని చెప్పింది. ఈ ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ వాఖ అంచనా వేస్తుంది. ఈదురు గాలులు కూడా బలంగా వీచే అవకాశముందని పేర్కొంది. ప్రధానంగా దక్షిన కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్యలో తీరం దాటే అవకాశముందని కూడా తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ ప్రభావంతో ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించింది.