Andhra Pradesh : ఏపీకి తుపాను ముప్పు.. అలెర్ట్ చేసిన వాతావరణ శాఖ

ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2024-06-28 03:49 GMT

ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది.బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని పేర్కొంది. ఇది క్రమంగా అల్పపీడనంగా మారి రానున్న 72 గంటల్లో ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది.

పిడుగులతో కూడిన వర్షాలు...
ఈ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, , పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.


Tags:    

Similar News