Cyclone Michoung : ఇరవై ఏళ్లలో ఇదే తొలిసారి... పదో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ
గత ఇరవై సంవత్సరాల్లో ఇదే అత్యంత భయానకమైన తుఫాను అని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు
గత ఇరవై సంవత్సరాల్లో ఇదే అత్యంత భయానకమైన తుఫాను అని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం అన్నింటికి సన్నద్ధమయింది. రెండు దశాబ్దాల క్రితం పెద్దగా అత్యాధునిక పరికరాలు, మొబైల్ వంటి సౌకర్యాలు తక్కువ. ఇప్పుడు అవి కొంచెం ఈ తుఫాను ను ఎదుర్కొనేందుకు ఉపయోగపడతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. బంగాళాఖాతంలో వాయువ్య దిశగా కదులుతున్న తుఫాను మరి కొద్ది గంటల్లోనే తీరం దాటనుంది.
భయంగుప్పిట్లో రేపల్లె...
తుఫాను తీరం దాటుతున్న సమయంలో బీభత్సం జరిగే అవకాశం ఉండటంతో అనేక చోట్ల పదో నెంబరు ప్రమాద హెచ్చరికలను తీర ప్రాంతాల్లో జారీ చేవారు. బాపట్ల జిల్లాలోని రేపల్లె, బాపట్ల, చీరాల నియోజకవర్గాల్లో సముద్ర తీర ప్రాంతం ఉండగా, నిజాంపట్నం హార్బర్ లోనే 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో రేపల్లె నియోజకవర్గంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. కాగా, గడిచిన 20 సంవత్సరాల్లో నిజాంపట్నం హార్బర్ లో పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఇదే మొదటిసారి