మూడు రోజులు మండే ఎండలు.. వార్నింగ్
మరో మూడు రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది
మరో మూడు రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరింతగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరించింది. ఇప్పటికే అనేక చోట్ల నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే నెలలో పెరగాల్సిన ఎండ తీవ్రత మార్చి రెండో వారంలోనే వచ్చిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
తుపాను కారణమే.....
విజయవాడ, నంద్యాల, రెంటచింతలలో నలభైకి పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలను నలభై డిగ్రీలు దాటుతాయని, వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తూ బయటకు రావాలని సూచించారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 21న తుపానుగా మ ారుతుందని, దానివల్ల పొడి వాతావరణం ఎక్కువై ఎండలు మరింత మండిపోతాయని చెప్పారు.