శ్రీకాకుళం తీరంలో విదేశీ విమాన డ్రోన్ కలకలం

విమానం ఆకారంలో ఉన్న ఆ డ్రోన్ సుమారు 9 అడుగుల పొడవుతో.. 111 కిలోల బరువు ఉన్నట్లు తెలిపారు. అలాగే BANSHEE TARGET..

Update: 2023-02-02 07:36 GMT

military drone

విమానం ఆకారంలో ఉన్న ఓ విదేశీ డ్రోన్ శ్రీకాకుళంలోని భావనపాడు సముద్రతీరంలో కలకలం సృష్టించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఈ డ్రోన్ కనిపించడంతో అధికారులు మెరైన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో రంగంలోకి దిగిన అధికారులు అక్కడికి చేరుకుని డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నారు. విమానం ఆకారంలో ఉన్న ఆ డ్రోన్ సుమారు 9 అడుగుల పొడవుతో.. 111 కిలోల బరువు ఉన్నట్లు తెలిపారు. అలాగే BANSHEE TARGET అనే అక్షరాలు, 8001 నంబర్ రాసి ఉందని అధికారులు తెలిపారు. కాగా.. ఆ విమానాన్ని పరిశీలించిన మెరైన్ పోలీసులు మిలటరీ డ్రోన్ గా అనుమానిస్తున్నారు.

రక్షణ శాఖ క్షిపణి ప్రయోగ సమయంలో విఫలమై సముద్రంలో పడిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ డ్రోన్ గురించి నేవీ, కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులకు సమాచారం అందించామని అధికారులు తెలిపారు. ఈ తరహా డ్రోన్లను వాతావరణ శాఖ, అంతరిక్ష పరిశోధనలలో శాస్త్రవేత్తలు వాడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. డ్రోన్ కు ఎలాంటి కెమెరాలు లేవు గానీ.. రేడియో సిగ్నల్స్ పంపే పరికరాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ డ్రోన్ ను ఏ దేశం వాడింది ? ఎందుకోసం ప్రయోగించారనేది తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News