కాపుకులమో కాదో..కాని బాబుకు అనుకూలం
పవన్ కల్యాణ్, చంద్రబాబు కలయికపై మంత్రి అమరనాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పవన్ కల్యాణ్, చంద్రబాబు కలయికపై మంత్రి అమరనాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాపు కులాన్ని చంద్రబాబు కాళ్ల వద్ద పెట్టేందుకు పవన్ మరోసారి ప్రయత్నిస్తున్నారన్నారు. విశాఖ గర్జనను ఈ కలయిక కోసం వాడుకున్నారని మంత్రి అమరనాథ్ అన్నారు. విశాఖలో జరిగిందేంటి? మీరు చెబుతున్నదేంటి అని ఆయన ప్రశ్నించారు. విశాఖలో ఎవరిపై ఎవరు దాడి చేశారు? మంత్రులపై దాడి చేసింది జనసైనికులు కాదా అని మంత్రి అమరనాథ్ నిలదీశారు. పెళ్లి, శోభనం ఒకేరోజు అన్నట్లు మీ కలయిక జరిగిందన్నారు.
పరామర్శలేంటి?
వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పవన్ కల్యాణ్ ను చంద్రబాబు పరామర్శించడం ఏంటని అన్నారు. పెళ్లి చేసుకుని కొన్నేళ్లు గడిపేసి ఎంతో కొంత ఇచ్చేసి వదిలేసుకుందామని ఉన్నట్లు నీ వ్యవహారం ఉందన్నారు. మొన్నటి వరకూ టీడీపీకి జనసేన సెప్టీ అని, ఇప్పుడు లీగల్ గా పెళ్లి చేసుకున్నారని ఎద్దేవా చేశారు. కాపుల గురించి మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. వంగవీటి రంగా మరణానికి కారణమైన వ్యక్తిని పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నావు సిగ్గుందా? అని ప్రశ్నించారు. ముద్రగద పద్మనాభం కుటుంబాన్ని బూతులు తిడుతుంటే అప్పుడు లేని కాపులు ఇప్పుడు గుర్తుకొచ్చారా? అని అమరనాథ్ ప్రశ్నించారు.
కమ్మ జనసేన...
నీది కమ్మ జనసేన అని ఆయన అన్నారు. పక్కన ఉన్న నాదెండ్ల మనోహర్ ప్రొడ్యూసర్ అని ఆయన చెప్పారు. నాదెండ్ల మిషన్ కంప్లీట్ అయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇన్నాళ్లూ రాజకీయ పార్టీని నడిపింది ఎవరో తెలియడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. కాపు కులమో కాదో అని పక్కన పెడితే పవన్ మాత్రం చంద్రబాబుకు అనుకూలం అని మరోసారి నిర్ధారణ అయింది. ఇంతకంటే ఏం కావలి ప్యాకేజీ కల్యాణ్ అని అనడానికి అని మంత్రి అమరనాథ్ తెలిపారు. ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని ఆయన అన్నారు.