Ambati Rambabu : రేపటి నుంచి మళ్లీ కామిడీ షో ..యువగళంపై అంబటి సెటైర్
రేపటి నుంచి ఆగిపోయిన హాస్య కథా చిత్రమ్ ప్రారంభ మవుతుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు
రేపటి నుంచి ఆగిపోయిన హాస్య కథా చిత్రమ్ ప్రారంభమవుతుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అసలు పుత్రుడు కామిడీ షో రేపటి నుంచి మళ్లీ మొదలు పెడుతున్నారన్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుండటంపై ఆయన సెటైర్ వేశారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల విశాఖలో జరిగిన అగ్ని ప్రమాదంలో మత్స్యకారులను వెంటనే ప్రభుత్వం ఆదుకుందని చెప్పారు. వేగంగా పరిహారాన్ని అందించింది జగన్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ ఆఘమేఘాల మీద వచ్చి యాభై వేల ఆర్థిక సాయాన్ని చేశారు మంచిదే కానీ అక్కడ జగన్ ను ఎందుకు దూషించారని అంబటి ప్రశ్నించారు.
అంతా అక్కడే...
చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ తీసుకుని మాట్లాడటం తప్ప మరొకటి పవన్ చేయడం లేదన్నారు. ఈ రాష్ట్రానికి, ఆయనకు ఏం సంబంధమని ప్రశ్నించారు. సొంత ఇల్లు కూడా లేని పవన్ జగన్ గురించి మాట్లాడే అర్హత ఉందా? అని నిలదీశారు. పవన్ కల్యాణ్ ఆస్తులు, కుటుంబాలన్నీ పొరుగు రాష్ట్రంలోనే ఉన్నాయని అంబటి ధ్వజమెత్తారు. కాపు సామాజికవర్గాన్ని చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టాలని నిర్ణయించుకున్నారని అన్నారు. బానిసగా ఉంటూ చంద్రబాబు, లోకేష్ పల్లకి మోస్తున్నారు. పవన్ పీకే కాదని, కిరాయి కల్యాణ్ అని అన్నారు.