అరసవిల్లి యాత్రపై అంబటి కామెంట్స్
అమరావతి రైతుల యాత్రలో నకిలీ రైతులు ఉన్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
అమరావతి రైతుల యాత్రలో నకిలీ రైతులు ఉన్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుర్తింపు కార్డులు అడిగితే చూపించలేక యాత్రను వాయిదా వేసుకున్నారన్నారు. అక్కడ ఉన్నది రైతులు కాదని అమరావతిలో భూములు కొనుగోలు చేసిన వారని తేలిపోయిందని ఆయన అన్నారు. తాత్కాలికంగా విరామం అని చెబుతున్నా శాశ్వతంగా పాదయాత్రకు విరామం ప్రకటించాల్సిందేనని అంబటి రాంబాబు అన్నారు.
జగన్ ను తిట్టడానికే...
దేవుడిని దర్శించుకోవడానికైతే ఎంపిక చేసుకున్న నియోజకవర్గాలు తిరిగి వెళ్లడమేంటని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఖచ్చితంగా ఇది రాజకీయ యాత్ర అని అన్నారు. తొడలు కొట్టడం, జగన్ ను తిట్టడం తో యాత్ర సాగుతుందన్నారు. టీడీపీ అనుకూలురు, జగన్ వ్యతిరేకులు ఈ యాత్రను చేస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు. రైతుల మహా పాదయాత్ర అరసవిల్లి వరకూ వెళ్లే అవకాశం లేదని ఆయన తేల్చి చెప్పారు.