అవనిగడ్డ సభ అట్టర్ ఫ్లాప్ : అంబటి
వారాహి యాత్ర అట్టర్ ప్లాప్ అయిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు
వారాహి యాత్ర అట్టర్ ప్లాప్ అయిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు సలహాలతోనే పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్ సభలకు వెళ్లమని లోకేష్ నుంచి టీడీపీ నేతలందరూ ట్వీట్లు చేసి ఫోన్లు చేసి చెప్పినా అక్కడ జనం లేరన్నారు. జనసేన సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని చెబుతూ అనైకతమైన వ్యక్తి అని పవన్ కల్యాణ్ పై ఫైర్ అయ్యారు. బీజేపీతో పొత్తులో ఉండి టీడీపీతో కలసి వెళ్లడంలో నైతికత ఉందా? అని అంబటి రాంబాబు అన్నారు.
బీజేపీతో పొత్తులో ఉండి...
బీజేపీపై ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదని పవన్ ను అంబటి ప్రశ్నించారు. జనసేన గ్లాసు పగిలపోయిందదని, సైకిల్ తుప్పు పట్టిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పులు మోయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడని సిగ్గులేని పవన్ అంటూ ఫైర్ అయ్యారు. తాము సన్నాసులామేనని, నీ లాగా రాజకీయంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ సంసారులం కాదని సెటైర్ వేశారు. చంద్రబాబుకు ఎందుకు మద్దతిస్తున్నావో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అంబటి రాంబాబు అన్నారు.
ఆయిల్ డబ్బులు...
వారాహి ఆయిల్ కూడా చంద్రబాబు అవినీతి డబ్బుతోనే వస్తుందన్నారు. వారాహి వాహనం కూడా నాదెండ్ల మనోహర్ డబ్బులు తీసుకువస్తే నడుస్తుందన్నారు. టీడీపీని బతికించాలన్న తాపత్రయం తప్ప ఇంకేదైనా కనపడుతుందా? అని ప్రశ్నించారు. ప్రజలు ఏమనుకుంటున్నావో తెలుసుకుంటున్నావా? అది తెలుసుకోలేకపోతే నీ ఖర్మ అంటూ అంబటి రాంబాబు అన్నారు. ప్రశ్నించడం మానేసి వ్యాక్సిన్ కనిపెట్టావా? అని ఎద్దేవా చేశారు. జనం మళ్లీ వ్యాక్సిన్ వేస్తారని కూడా అంబటి రాంబాబు అన్నారు. రానున్న ఎన్నికల్లో 175 సీట్లు ఈసారి జగన్ పార్టీవేనని ఆయన అన్నారు. చంద్రబాబు, పవన్ కలసి వచ్చినా తమను ఏం చేయలేరన్నారు.