తిరుమలలో మంత్రి గారి దర్జా

తిరుమల శ్రీవారి చెంతకు మంత్రి అప్పలరాజు వచ్చారు. అయితే ఆయనతో పాటు 150 మంది అనుచరులు రావడంతో కొంత ఇబ్బంది ఏర్పడింది.

Update: 2022-07-28 05:09 GMT

తిరుమల శ్రీవారి చెంతకు మంత్రి అప్పలరాజు వచ్చారు. అయితే ఆయనతో పాటు 150 మంది అనుచరులు రావడంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. 150 మంది అనుచరులను ప్రత్యేక దర్శనం కోసం అనుమతించాలని టీటీడీ అధికారులపై వత్తిడి తెచ్చారు. దీంతో టీటీడీ అధికారులు 150 మందిని ఒకేసారి ప్రత్యేక దర్శనానికి అనుమతించారు. దీని కారణంగా సామాన్య భక్తులు ఇబ్బంది పడ్డారు. అయినా మంత్రి అప్పలరాజు మాత్రం అంతమంది అనుచరులతో రావడం చర్చనీయాంశమైంది.

పోలవరంపై....
అయితే తాను శ్రీవారిని దర్శించుకోవడం అదృష్టమని మంత్రి అప్పలరాజు తెలిపారు. జులై నెలలోనే ఊహించని విధంగా వరదలు రావడం ఇబ్బందికరంగా మారిందన్నారు. అన్ని అడ్డంకులు తొలగిపోవాలని దేవుణ్ణి ప్రార్థించానని అప్పలరాజు తెలిపారు. పోలవరం సమస్య వెంటనే పరిష్కారం కావాలని కోరుకున్నానని చెప్పారు. భద్రాచలం ముంపునకు పోలవరం సాకుగా చూపడం ఏంటని ఆయన ప్రశ్నించారు. తాను 150 మందితో శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.


Tags:    

Similar News