ఉద్యోగులను తప్పుదోవ పట్టించే యత్నమే

ఆంధప్రదేశ్ లో ఉద్యోగులను కొందరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అప్పలరాజు అన్నారు

Update: 2022-01-18 11:58 GMT

ఆంధప్రదేశ్ లో ఉద్యోగులను కొందరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అప్పలరాజు అన్నారు. ప్రభుత్వం అమలు చేసిన పీఆర్సీ, ఫిట్ మెంట్ కారణంగా ఉద్యోగుల జీతభత్యాల్లో ఎలాంటి కోత పడదని ఆయన అన్నారు. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చని మంత్రి అప్పలరాజు తెలిపారు.

వ్యతిరేకతను పెంచడానికి....
కావాలని ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వ్యతిరేకతను పెంచడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారని అర్ధమవుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ తో చర్చలు జరిపిన అనంతరం కొన్ని ఉద్యోగ సంఘాలు పీఆర్సీ, ఫిట్ మెంట్ పై సంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. సమ్మెకు దిగాలన్న ఆలోచనను ఉద్యోగ సంఘాలు విరమించుకోవాలని అప్పలరాజు స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల నేతల మాటలకు లొంగిపోవద్దని సూచించారు. రానున్న రోజుల్లో చంద్రబాబు జగన్ బొమ్మ పెట్టుకుని ప్రచారం చేసుకోవాలని అప్పలరాజు ఎద్దేవా చేశారు.


Tags:    

Similar News