ఉత్తరాంధ్ర, సీమలో ఉద్యమాలు రావాలా?

అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసమే మూడు రాజధానుల ప్రతిపాదనను తమ ప్రభుత్వం తెచ్చిందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు

Update: 2022-03-06 06:26 GMT

అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసమే మూడు రాజధానుల ప్రతిపాదనను తమ ప్రభుత్వం తెచ్చిందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే దీనిని తెచ్చామని చెప్పారు. కానీ ప్రభుత్వం మంచి చేయాలనుకుంటే కొన్ని దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయని ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమైతే ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన సమస్యలే తిరిగి ఉత్పన్నమవుతాయని చెప్పారు.

విడిపోయి....
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి నష్టపోయిన విషయాన్ని ధర్మాన కృష్ణదాస్ గుర్తు చేశారు. వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలో మళ్లీ ఉద్యమాలు రాకుండా ఉండేందుకే ఈ ప్రతిపాదనలు తెచ్చామని చెప్పారు. చంద్రబాబు ఒక సామాజికవర్గం కోసం చేసిన ప్రయత్నమే అమరావతి అని ధర్మాన కృష్ణదాస్ ఫైర్ అయ్యారు. అమరావతిలో కేవలం 26 గ్రామాలు మాత్రమే అభివృద్ధి చెందుతాయని చెప్పారు.


Tags:    

Similar News