నేను వద్దు వద్దంటే జగనే పోటీ చేయమంటున్నారు
మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వద్దంటున్నా జగన్ పోటీ చేయమంటున్నారన్నారు
వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలకు టిక్కెట్లు దక్కడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎడా పెడా మార్చేస్తున్నారు. ఇప్పటికే యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జులను మార్చారు. గెలుపు అవకాశం ఉన్నవాళ్లకే టిక్కెట్లు కేటాయిస్తామని వైసీీపీ హైకమాండ్ చెబుతూ వస్తుంది. ఆ మేరకే ఇన్‌ఛార్జులను నియమిస్తూ ఇప్పటికే నాలుగు జాబితాలను వైసీపీ అధినాయకత్వం ప్రకటించింది. కానీ ఒక నేతను మాత్రం అక్కడ తననే జగన్ పోటీ చేయమంటున్నారని చెప్పడం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.
ధర్మాన మాత్రం...
ఆయన జరుగుతున్న పరిణామాలకు భిన్నంగా మాట్లాడారు. ఆయనే మంత్రి ధర్మాన ప్రసాదరావు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన తనకు లేదని ధర్మాన చెప్పారు. అయితే తనను తప్పకుండా పోటీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ కోరుతున్నారన్నారు. తాను పార్టీ వ్యవహారాలను చూసుకుంటానని జగన్ తో చెప్పినా ఆయన మాత్రం ఒప్పుకోవడం లేదని తెలిపారు. తాను పోటీ చేయడం పై ముఖ్యమంత్రి జగన్ కు తాను ఇంకా స్పష్టత ఇవ్వలేదని మంత్రి ధర్మాన తెలిపారు.