లోకేష్ అడ్రస్ లేనోడు: మంత్రి కాకాణి
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అడ్రస్ లేనిదన్నారు. అందుకే లోకేష్ చేపట్టిన యాత్రలో ప్రజలు లేక వెలవెల బోతోందని ఎద్దేవా చేశారు. నారా లోకేష్ రాత్రిది దిగక హ్యాంగోవర్‌లో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. లోకేష్ అడ్రస్ లేనోడని, అందుకే ఆయన పాదయాత్ర వెలవెలబోతోందన్నారు. ఓ ఉద్దేశ్యం లేకుండా రాత్రి పూట వాకింగ్ చేస్తూ, దానిని పాదయాత్ర అని లోకేష్ ప్రచారం చేసుకుంటున్నాడని మంత్రి కాకాణి సెటైర్ వేశారు. తాము, తమ ఎమ్మెల్యేలు చేస్తున్న సవాళ్లకు లోకేష్ దగ్గరి నుండి ఎలాంటి సమాధానాలు రావడం లేదన్నారు.
లోకేష్ ఉన్న ఒకే ఒక క్వాలిఫికేషన్.. చంద్రబాబు కొడుకు అని అన్నారు. లోకేష్ ఎన్నికల్లో గెలవలేదని, గెలిచి ప్రజాదరణ పొందలేదని, పోటీ చేసినా మొదటిసారే ఓటమి పాలయ్యాడని అన్నారు. చంద్రబాబు, లోకేష్‌లు అవినీతిలో ఘనకీర్తి సాధించారని ఎద్దేవా చేశారు. బాబు, లోకేష్‌లను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల మీద పెట్టుబడులు పెడితే వృథా తప్పా ఆదాయం ఉండదని చెప్పిన మహోన్నతమైన ఆర్థిక శాస్త్రవేత్త చంద్రబాబు అంటూ మంత్రి కాకాణి దుయ్యబట్టారు. రాజకీయంగా ఓట్లు దండుకోవడం కోసం పాదయాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
పవన్ కల్యాణ్ ఒక సంస్కార హీనుడు, ఆయన భాషని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని మంత్రి కాకాణి విమర్శించారు. గత ఎన్నికల్లో పవన్‌ను రెండు చోట్లా ఓడించి.. ప్రజలు బట్టలూడదీసినట్లు బుద్ధి చెప్పారని అన్నారు. పవన్ అందుకే ఇలాంటి భాష వాడుతున్నాడని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతో పవన్ కల్యాణ్ పని చేస్తున్నారని ఆరోపించారు. పవన్‌కు జనాలతో కొట్టించుకోవడం, తిట్టుంచుకోవడం అలవాటేనన్నారు. పవన్, లోకేష్‌లు ప్రస్టేషన్‌లోనే ఉన్నారని, అందుకే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి కాకాణి అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనంలోంచి వచ్చిన వ్యక్తి అని మంత్రి పేర్కొన్నారు.