Nara Lokesh : నాడు - నేడు పనుల్లో అక్రమాలపై విచారణ
గత ప్రభుత్వంలో పాఠశాలల్లో నాడు నేడు పనుల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరుపుతామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు;

గత ప్రభుత్వంలో పాఠశాలల్లో నాడు నేడు పనుల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరుపుతామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టామన్న నారా లోకేశ్ దశలవారీగా స్కూళ్లలో ప్రహరీగోడల నిర్మాణం చేపడతామని చెప్పారు. నాడు-నేడు అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారు.
విద్యార్థి మృతిపై...
అలాగే తాజాగా సి.బెళగల్ మండలం పోలకల్ జిల్లాపరిషత్ హైస్కూలు ఆవరణలో ఇటీవల దురదష్టవశాత్తు చెట్టు విరిగిపడిన ఘటనలో గాయాలపాలై చికిత్సపొందుతూ 8వతరగతి విద్యార్థిని శ్రీలేఖ మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని నారా లోకేశ్ అన్నారు. చిన్నారి శ్రీలేఖ మృతితో ఆమె తల్లిదండ్రులకు కలిగిన నష్టం తీర్చలేనిదన్నారు. శ్రీలేఖ కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు