Nara Lokesh : లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన లోకేష్
భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాలను మంత్రి నారా లోకేష్ పర్యటించారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగుతుంది.
భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాలను మంత్రి నారా లోకేష్ పర్యటించారు. మంగళగిరి నియోజకవర్గంలో ఆయన పర్యటన కొనసాగుతుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంగళగిరి ప్రాంతంలో వరద నీరు చేరింది. అనేక చోట్లకు నీరు చేరి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి టౌన్ నులకపేట క్వారీ ప్రాంతాన్ని నారా లోకేష్ పరిశీలించారు.
మంగళగిరి నియోజకవర్గంలో...
ముంపు కి గురైన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. నీటిని వీలైనంత త్వరగా బయటకు తోడేందుకు చేసిన ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్న లోకేష్ ప్రభుత్వం ుంచి నుంచి అందుతున్న సాయం, ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు గురించి బాధితులను అడిగి నారా లోకేష్ తెలుసుకున్నారు.