మంచి పథకం... ముందుకు రండి

ఓటీఎస్ పథకాన్ని అందరూ వినియోగించుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు

Update: 2021-12-27 07:12 GMT

ఓటీఎస్ పథకాన్ని అందరూ వినియోగించుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. పేదలకు ఉపయోగపడే పథకాన్ని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. కొందరు కావాలని ఓటీఎస్ పథకంపై విమర్శలు చేస్తున్నారని, వారిని పట్టించుకోవద్దని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఒక వర్గం మీడియా దీనిపై అసత్య ప్రచారం చేస్తుందని, వాటిని నమ్మవద్దని ప్రజలను ఆయన కోరారు. ఓటీఎస్ ద్వారా పేదలకు శాశ్వత గృహ హక్కు కలుగుతుందని చెప్పారు.

విపక్షాల విమర్శలను....
సంస్కరణలను తేవడంలో భాగంగా ఓటీఎస్ పథకాన్ని జగన్ తెచ్చారన్నారు. ఓటీఎస్ ద్వారా హక్కు పొందితే తాకట్టు పెట్టుకునేందుకు, రుణం తెచ్చుకునేందుకు ఉపయోగపడుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసేందుకు ముందుకు వచ్చినప్పుడు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విపక్షాల మాయమాటలను విశ్వసించవద్దని కోరారు.


Tags:    

Similar News