చర్చలకు వచ్చేంత వరకూ వేచి చూస్తాం
పీఆర్సీ పై ఉద్యోగులు చర్చలకు వచ్చే దాకా వేచి చూస్తామని మంత్రి పేర్ని నాని అన్నారు
పీఆర్సీ పై ఉద్యోగులు చర్చలకు వచ్చే దాకా వేచి చూస్తామని మంత్రి పేర్ని నాని అన్నారు. ఉద్యోగులు కోరినట్లే ప్రభుత్వం సంప్రదింపులు కమిటీ వేసిందని చెప్పింది. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని పేర్ని నాని తెలిపారు. రిపబ్లిక్ డే తర్వాత చర్చలకు రావాలని ఆహ్వానించినా రాలేదన్నారు. వ్యక్తిగతంగా తాము కూడా మాట్లాడుతున్నామని చెప్పారు. ఆర్థిక శాఖ అధికారులు చెబుతుంది తప్పా? ఉద్యోగులు చెబుతుంది తప్పా? అన్నది తెలుసుకుని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
మంచి చేయాలనే.....
చర్చలకే రాకుండా సమస్య పరిష్కారం కావాలంటే ఎలా అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎప్పుడూ ఉద్యోగులకు మంచి చేయాలనే ఆలోచిస్తుందని చెప్పారు. వేరే ఆలోచనలు మాని చర్చలకు వస్తే ఫలితం ఉంటుందని పేర్ని నాని అభిప్రాయపడ్డారు. వారు చర్చలకు వచ్చేంత వరకూ తాము వేచి చూస్తూనే ఉంటామని పేర్ని నాని చెప్పారు.