బాబు డేరా బాబా కన్నా డేంజర్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. డేటా దొంగ చంద్రబాబు అంటూ ఆమె కామెంట్ చేశారు. కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. డేరా బాబా కంటే చంద్రబాబు డేంజర్ అని రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబు పెగాసస్ సాప్ట్ వేర్ కొన్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ చెప్పిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. డేటా చోరీపై సమగ్ర విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.
బాబు హయంలో...
చంద్రబాబు హయాంలో ఎవరికైనా సంక్షేమ పథకాలు అందాయా? అని రోజా ప్రశ్నించారు రైతు రుణ మాఫీ చేయకుండా, డ్వాక్రా రుణాల వడ్డీని మాఫీ చేయకుండా మోసం చేశారన్నారు. చంద్రబాబు తన హయాంలో పేదల కోసం ఏ ఒక్క పథకాన్ని అయినా తెచ్చారా? అంటూ నిలదీశారు. ఎన్టీఆర్ రెక్కల కష్టాన్ని వాడుకుని చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని రోజా మండి పడ్డారు. జగన్ పాలనలో సంక్షేమం ప్రతి పేదవాడికీ అందుతుందని ఆమె అన్నారు.