పవన్ పై ఆర్కే రోజా ఫైర్
పవన్ కల్యాణ్ పై మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా గెలవలేని పవన్ సర్వే చూస్తే నవ్వు వస్తుందన్నారు
పవన్ కల్యాణ్ పై మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా గెలవలేని పవన్ కల్యాణ్ సర్వే చూస్తే నవ్వు వస్తుందని ఆమె అన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ కూడా పవన్ ను చూసి నవ్వుకుంటుందని అన్నారు. రాష్ట్రాన్ని నాశనం చేసింది పవన్, చంద్రబాబు కాదా? అని రోజా ప్రశ్నించారు. పవన్ పార్టీ పెట్టింది ప్రజల కోసం కాదని, చంద్రబాబు కోసమేనని ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను వదిలేసి పారిపోయి వచ్చిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని పవన్ ను రోజా ప్రశించారు. పవన్ డైలాగులు చూసి నవ్వుకుంటున్నారన్నారు.
లోకేష్ అజ్ఞానాన్ని...
లోకేష్ తన అజ్ఞానాన్ని ఈరోజు కూడా బయట పెట్టుకున్నారన్నారు. రైతు వ్యతిరేకి చంద్రబాబు కాదా? అని రోజా ప్రశ్నించారు. రైతుల కోసం ఏం చేశారన్నది నీ తండ్రిని అడుగు అని ఆమె నిలదీశారు. జగన్ రైతులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నారని రోజా తెలిపారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు రైతులకు చేసింది శూన్యమన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కరవు వస్తుందని, అదే జగన్ అధికారంలో ఉన్న ప్రతి ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని రోజా తెలిపారు.