పవన్ కల్యాణ్ పొలిటికల్ జోకర్
పవన్ కల్యాణ్ పొలిటికల్ జోకర్ అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. పవన్ కు చంద్రబాబు నుంచి కలెక్షన్లు అందాయన్నారు
పవన్ కల్యాణ్ పొలిటికల్ జోకర్ అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. పవన్ కు చంద్రబాబు నుంచి కలెక్షన్లు అందాయన్నారు. జగన్ లా తాను పోటీ చేయలేనని, తాను చేతకాదని పవన్ బహిరంగంగా ఒప్పుకున్నాడని రోజా అన్నారు. పవన్ కంటే ఎక్కువగా తాను మాట్లాడగలనని అన్నారు. చంద్రబాబు చెత్త ఆలోచనలను భోగిమంటల్లో వేయాలని రోజా పిలుపునిచ్చారు.
వచ్చే ఎన్నికల్లోనూ...
వచ్చే ఎన్నికల్లోనూ ఎంత మంది కలసి వచ్చినా జగన్ గెలుపును ఎవరూ ఆపలేరని ఆర్కే రోజా అన్నారు. మంత్రిగా తాను తొలి సంక్రాంతి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు ప్రజలందరూ సంక్రాంతి సుఖ సంతోషాలతో ఉండాలని రోజా ఆకాక్షించారు.