నోరుజారి బుక్కైన మంత్రి రోజా.. సీన్ రివర్స్

మంత్రి రోజా టంగ్ స్లిప్ అయ్యి అడ్డంగా దొరికిపోయారు. పాత వీడియోలతో టీడీపీ నెట్టింట తెగ ట్రోల్ చేస్తోంది.

Update: 2022-05-07 11:06 GMT

తెలుగు రాష్ట్రాల్లో మంత్రి రోజా ఓ ఫైర్ బ్రాండ్ మహిళా నేత. విపక్షాలపై విరుచుకుపడడంలో ఆమె దిట్ట. అందులోనూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై చెలరేగిపోతారు. పదునైన వ్యాఖ్యలతో పంచులు వేస్తుంటారు. అలాంటి రోజా సడెన్‌గా నోరుజారి అడ్డంగా దొరికిపోయారు. టంగ్ స్లిప్ అవడంతో ట్రోలింగ్‌కు గురవుతున్నారు. గతంలో టీడీపీ నేతలపై విమర్శలు కురిపించిన అదే పాయింట్‌పై పొరపాటున నోరుజారడంతో సీన్ రివర్సైంది.

తెల్లోడి తుపాకీ గుండుకు గుండెను చూపించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి రోజున గుర్తు చేసుకుంటూ మంత్రి రోజా టంగ్ స్లిప్ అయ్యారు. ఈరోజు ఆయన వర్ధంతి అయితే జయంతి అంటూ వ్యాఖ్యానించారు. పొరపాటున టంగ్ స్లిప్ అయినా ప్రతిపక్ష పార్టీకి చిక్కేశారు. గతంలో ఆమె జయంతికి.. వర్ధంతికి తేడా తెలియదంటూ లోకేష్‌ను అసెంబ్లీలో ఓ రేంజ్‌లో విమర్శలు చేసిన వీడియోను టీడీపీ సోషల్ మీడియా వెలికితీసింది.

గతంలో మంత్రి చేసిన వ్యాఖ్యలను గుర్తుకు తెస్తూ నెట్టింట తెగ ట్రోల్ చేస్తోంది. జయంతికి.. వర్థంతికి తేడా తెలియదంటూ విమర్శలు గుప్పిస్తోంది. 'వర్థంతికీ జయంతికీ తేడా తెలియని రోజా మనకి మంత్రి' అంటూ తెలుగుదేశం పార్టీ ఘాటు ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌పై నెటిజన్లు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. రోజా వ్యాఖ్యలపై సెటైర్లు పేలుస్తున్నారు.



Tags:    

Similar News