చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇళ్లు ఎక్కడున్నాయ్: రోజా

రిషికొండపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేస్తున్నార

Update: 2023-08-12 11:47 GMT

రిషికొండపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. బోడి వెదవలు, బోడి ప్రచారం చేస్తున్నారని.. రుషికొండలో ఏం అక్రమాలు జరుగుతున్నాయో పవన్ చెప్పలేకపోయారన్నారు. విశాఖను క్రైమ్ సిటీగా పవన్, చంద్రబాబులు చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని.. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించినప్పటి నుండి విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కొండలపై కట్టడాలు వద్దని పవన్ అజ్ఞానంగా మాట్లాడుతున్నారన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇళ్లు బంజారాహిల్స్ కొండపైనే ఉన్నాయి కదా అన్నారు. సుప్రీం కోర్టు రిషికొండలో నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందన్నారు. సుప్రీం కోర్టు కంటే పవన్ కల్యాణ్ గొప్పవాడా? అని ప్రశ్నించారు. తాము కట్టే ప్రతి కట్టడాలకు అనుమతి తీసుకున్నామన్నారు. ఇది అక్రమ కట్టడం కాదని, ప్రభుత్వ కట్టడమన్నారు. రిషికొండ పేరుతో పవన్ హడావిడి చేశారన్నారు. చంద్రబాబు చెప్పినట్లు వినే బానిస పవన్ కళ్యాణ్ అన్నారు. అసలు జగన్ కు ఎన్ని ఇళ్లు కావాలని అడగడానికి నువ్వెవరు అని నిలదీశారు. జగన్ కన్ను తెరిస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్నారు. చంద్రబాబు ప్రజల డబ్బును వృథా చేశారన్నారు. ఆయన తన కరకట్ట ఇంటికి రూ.40 కోట్లు, సీఎం ఆఫీస్ ఫర్నీచర్ కు రూ.10 కోట్లు, హైదరాబాద్‌లోని తన నివాసాలన్నింటికి కలిపీ రూ.50 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఇలా మొత్తం రూ.187 కోట్లు ఖర్చు చేశారని, దీనిపై పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. జగన్ మాత్రం సీఎం కాకముందే తాడేపల్లిలో సొంతగా ఇళ్లు కట్టుకొని, ఇప్పుడు కూడా అక్కడి నుండి పరిపాలన సాగిస్తున్నారన్నారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి వైజాగ్ కు ఇన్ఫోసిస్, అదానీ డేటా సెంటర్ ఇలా ఎన్నో కంపెనీలు తీసుకురావడంతో పాటు అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు. కానీ ప్రభుత్వం దోచుకుంటుందంటూ విశాఖ ప్రజలను రెచ్చగొట్టి పవన్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పక్క పార్టీల జెండా మోయడానికి పార్టీ పెట్టిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తారో పవన్ చెప్పకుండా విమర్శలు ఏమిటన్నారు. పవన్‌కు 55 ఏళ్లు వచ్చాయని, కానీ అమిత్ షాకు చెప్పి ఆడిస్తానని చెప్పడం విడ్డూరమన్నారు.


Tags:    

Similar News