వైఎస్ షర్మిలపై రోజా కామెంట్లు విన్నారా?
పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ఏపీ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు
పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ఏపీ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ప్రారంభించారు షర్మిల. ఆదివారం సోదరుడు జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయడంతో వైసీపీ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.జగన్ రెడ్డి అనడంపై సుబ్బారెడ్డి అభ్యంతరం చెబితే తనకు జగనన్న అనడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తాజాగా షర్మిల వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిలపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. ఏపీకి షర్మిల రాక.. మరొక నాన్‌లోకల్ పొలిటీషియన్ వచ్చినట్టేనని, రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు ఓటు అడిగే హక్కులేదని మంత్రి రోజా అన్నారు. వైఎస్సార్ చనిపోయిన తర్వాత ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని, కాంగ్రెస్ పార్టీ జగన్‌ను 16 నెలలు జైల్లో పెట్టించిందని విమర్శించారు. అలాంటి కాంగ్రెస్ లో షర్మిల ఎలా చేరిందని ప్రశ్నించారు.
నగరి నియోజకవర్గంలోని వడమాలపేటలో స్విమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పింక్ బస్ క్యాంప్ ను రోజా ప్రారంభించారు. నగరి నియోజకవర్గంలో 14వ సారి పింక్ బస్ క్యాంప్ ద్వారా మహిళల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నామని రోజా తెలిపారు. ప్రతి మహిళ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని... క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.