మరో వైసీపీ ఎమ్మెల్యే థిక్కారస్వరం.. నెల్లూరు నుంచే
నేతలను సమన్వయం పర్చకుండా ధనంజయరెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.
నెల్లూరు జిల్లాలో మరో వైసీపీ ఎమ్మెల్యే పార్టీ తీరుపై విరుచుకుపడ్డారు. నేతలను సమన్వయం పర్చకుండా ధనంజయరెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళతానని తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గానికి పరిశీలకుడిగా వచ్చిన ధనుంజయరెడ్డి పార్టీ ఇబ్బందులున్నా, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నా వారిని సర్దుబాటు చేయాల్సిన ధనుంజయ్ రెడ్డి తన వ్యతిరేకులతో కుమ్మక్కయ్యారన్నారు.
ఆయన పెత్తనాన్ని...
ఆయన పెత్తనాన్ని తాము సహించమని తేల్చి చెప్పారు. నేతలను సమన్వయ పర్చకుండా తనకు వ్యతిరేకంగా గ్రూపులు కడుతున్నారన్నారు. ఆయన వల్ల పార్టీకి తీరని నష్టమని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా ధనంజయరెడ్డిని వెనక్కు పిలిపించకపోతే నియోజకవర్గంలో పార్టీ పట్ల వ్యతిరేకత ఎక్కువవుతుందని ఆయన అన్నారు. మేకపాటి కూడా అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.