జైలు నుంచి విడుదలయిన అనంతబాబు
ఎమ్మెల్సీ అనంతబాబు రాజమండ్రి జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు.
ఎమ్మెల్సీ అనంతబాబు రాజమండ్రి జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్యచేసి శవాన్ని ఆయన ఇంటికి తీసుకు వచ్చిన అనంతబాబుపై పోలీసులు హత్యానేరం కింద కేసు పెట్టారు. హైకోర్టులో బెయిల్ పిటీషన్ తిరస్కరణకు గురి కావడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
షరతులువే...
ీదీంతో సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. షరతులు మాత్రం సెషన్స్ కోర్టు విధిస్తుందని తెలిపింది. అయితే నిన్న సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండటంతో ఆయన బెయిల్ పై జైలు నుంచి విడుదల కాలేదు. ఈరోజు సెషన్స్ కోర్టు జడ్జి షరతులు విధించారు. అనంతబాబు తన పాస్‌పోర్టును అప్పగించాలని, విదేశాలకు వెళ్లకూడదని తెలిపింది. ఈ ఏడాది మే 23 నుంచి జైలులో అనంతబాబు ఉన్నారు.