రేపు మోదీతో అల్లూరి కుటుంబీకులు

ఏపీలోని భీమవరంలో రేపు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. అల్లూరి సీతారామ రాజు 125 జయంతి వేడుకల్లో పాల్గొంటారు

Update: 2022-07-03 05:13 GMT

ఆంధ్రప్రదేశ్ లోని భీమవరంలో రేపు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. అల్లూరి సీతారామ రాజు 125 జయంతి వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు. విగ్రహావిష్కరణ తర్వాత భారీ బహిరంగ సభ జరగనుంది. 16 ఎకరాల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. లక్ష మంది వరకూ ఈ సభకు హాజరవుతారని అంచనా.

మోదీ సభకు...
అయితే ప్రధాని మోదీని రేపు అల్లూరి సీతారామరాజు బంధువులు కలవనున్నారు. అల్లూరి సోదరుడు, సోదరి మనవలు, మునిమనవళ్లు మొత్తం 37 మంది మోదీతో భేటీ అవుతారు. వీరితో కాసేపు ప్రధాని మోదీ ముచ్చటిస్తారు. ప్రధాని సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు కొద్దిసేపటి క్రితం భీమవరంలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు నేలకొరిగాయి. వేదిక వద్ద కూడా బురద మయంగా మారింది. బురదను తొలగించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.


Tags:    

Similar News