మండుటెండలకు ఉపశమనం.. ఏపీలోకి నైరుతి రుతుపవనాలు వచ్చేది అప్పడే..
మే 22 వ తేదీకి అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాలు విస్తరించి, జూన్ 4కి కేరళను తాకుతాయన్నారు. కేరళను రుతుపవనాలు తాకడంతో
ఈ సంవత్సరం భారత్ లోకి నైరుతి రుతుపవనాల రాక ప్రతి ఏడాది కంటే మూడు రోజులు ఆలస్యం కానుందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. ఏటా జూన్ 1న కేరళను తాకే రుతుపవనాలు.. ఈ ఏడాది జూన్ 4న ప్రవేశిస్తాయని వెల్లడించింది. అవి క్రమంగా విస్తరిస్తూ జూన్ 15వ తేదీ నాటికి ఏపీలోకి ప్రవేశిస్తాయని ఐఎండీ వివరించింది.
ప్రస్తుతం అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో రుతుపవనాల రాకకు సూచనగా మూడ్రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు. మే 22 వ తేదీకి అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాలు విస్తరించి, జూన్ 4కి కేరళను తాకుతాయన్నారు. కేరళను రుతుపవనాలు తాకడంతో.. వాటి ప్రభావం ఏపీపై కూడా ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు. కేరళను తాకిన 10 రోజులకు రాయలసీమ మీదుగా ఏపీలోకి నైరుతి రుతుపవనాల రాక ఉంటుంది. ప్రస్తుతం కోస్తా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ ఉన్న ద్రోణి ప్రభావంతో రానున్న ఐదురోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వివరించారు.