పిటీషన్ ను వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదు
చింతామణి నాటకంపై హైకోర్టులో వేసిన పిటీషన్ ను తాను వెనక్కు తీసుకోబోనని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు
చింతామణి నాటకంపై హైకోర్టులో వేసిన పిటీషన్ ను తాను వెనక్కు తీసుకోబోనని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. తాను సుబ్బిశెట్టి పాత్రను నాటకంలో తీసివేసి నాటకాన్ని నిషేధించవద్దని కోరానని చెప్పారు. తనను ఆర్యవైశ్యులు అర్ధం చేసుకోలేదని ఆవేదన చెందారు. జగన్ ఆయన అనుచరులు చేేసే ప్రచారాన్ని నమ్మవద్దని రఘురామ కృష్ణరాజు కోరారు. తాను ఆర్యవైశ్యులకు వ్యతిరేకంగా ఈ పిటీషన్ వేయలేదని చెప్పారు.
నిషేధించకూడదనే....
చరిత్ర ఉన్న చింతామణి నాటకాన్ని కొనసాగించాలని, అందులో సుబ్బిశెట్టి పాత్రను తొలగించాలన్నదే తన పిటీషన్ లో సారాంశమని రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. నాటకాన్ని కాపాడటమే తన ప్రధాన ఉద్దేశ్యమని ఆయన వివరించారు. తాను పిటీషన్ ను వెనక్కు తీసుకోబోనని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల నేతలో ముఖ్యమంత్రి జగన్ కాళ్ల బేరానికి వచ్చారని రఘురామ కృష్ణరాజు ఎద్దేవా చేశారు.