వేసీపీకి వచ్చే సీట్లు ఎన్నంటే?
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే విజయాన్ని ఎవరూ ఆపలేరని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే వాటి విజయాన్ని ఎవరూ ఆపలేరని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు పార్టీలు కలసి పోటీ చేయాలన్నదే జనాభిప్రాయమని తెలిపారు. ఆ అవకాశం ఉందన్న రాజు రాష్ట్రంలో మూడే ప్రధాన పార్టీలున్నాయని మిగిలిన పార్టీలకు ఓటు బ్యాంకు శఆతం కేవలం ఒక్క శాతం మాత్రమేనని ఆయన తెలిపారు. ఇక టీడీపీ, జనసేనలతో బీజేపీ కలిస్తే ఈ కూటమికి తిరుగుండదని ఆయన జోస్యం చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో 36 స్థానాలకు మించి రావని రఘురామ కృష్ణరాజు అభిప్రాయపడ్డారు. అంతకంటే తక్కువ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అన్నారు.
గత ఎన్నికల తర్వాత...
గత ఎన్నికల తర్వాత జనసేన పార్టీ బలం పెరిగిందన్న రఘురామ కృష్ణరాజు వైసీపీ ఓట్ల శాతం గణనీయంగా తగ్గిందన్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన సీట్లు ఈసారి టీడీపీ, జనసేనలకు వస్తాయన్న ఆయన తక్కువలో తక్కువ 130 స్థానాలు రావడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని తెలిపారు. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకూ వైసీపీకి ఒకటి రెండు సీట్లకు మించి రావని ఆయన అన్నారు. వివేకా హత్య సానుభూతి చూపితే రాయలసీమలోనూ వైసీపీకి కష్టాలు మొదలయినట్లేనని అంచనా వేశారు. ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన కూటమికి మరిన్ని స్థానాలు పెరగటమే తప్ప తగ్గవని రఘురామ కృష్ణరాజు అన్నారు.