ఏలూరు కాల్వలో లభ్యమైన నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణ మృతదేహం
పుట్టిన రోజే చనిపోయే రోజంటూ మెసేజ్ పెట్టి ఇంట్లోంచి వెళ్లిపోయిన
పుట్టిన రోజే చనిపోయే రోజంటూ మెసేజ్ పెట్టి ఇంట్లోంచి వెళ్లిపోయిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో మండవ వెంకటేశ్వరరావు మృతదేహం ఏలూరు కాల్వలో లభ్యమైంది. వారం రోజులుగా గాలింపు జరుపుతున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు మధురానగర్ పైవంతెన పిల్లర్‌కు చిక్కుకున్న మృతదేహం కనిపించింది. ఆయన దూకిన ప్రదేశానికి సరిగ్గా కిలోమీటర్ దూరంలో మృతదేహాన్ని గుర్తించారు.
విజయవాడ సమీపంలోని కానూరు మహదేవపురంలో ఉండే వెంకటరమణారావు నరసాపురంలో ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు సెలవు పెట్టిన ఆయన కానూరు వచ్చారు. 15న మచిలీపట్నం వెళ్లారు. అర్ధరాత్రి తాను చనిపోతున్నానని, అందరూ జాగ్రత్త అని మెసేజ్ పెట్టి సెల్ ఆఫ్ చేశారు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మచిలీపట్నం, విజయవాడలో గాలింపు చేపట్టారు. ఆయన వాహనం మచిలీపట్నం రైల్వే స్టేషన్‌లో ఉన్నట్టు గుర్తించారు. చివరికి ఆయన చనిపోయినట్లు గుర్తించారు.
వెంకటరమణారావు కనిపించకుండా పోవడానికి మాధవాయిపాలెం పెర్రీ రేవు పాటదారు రూ. 54 లక్షల బకాయిలు ఉండడమే కారణమని అంటున్నారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు ఏలూరు కాలువ వద్ద సిగ్నల్ కట్ అయినట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కాలువలో గాలించారు. ఫోన్ సిగ్నల్ కట్ అయిన ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో ఎంపీడీఓ వెంకటరమణారావు మృతదేహం లభ్యమైంది.