జగన్కు ముద్రగడ లేఖ
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ముద్రగడ పద్మనాభం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ముద్రగడ పద్మనాభం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. కాపు జాతికి రిజర్వేషన్ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈడబ్ల్యూఎస్ కింద వచ్చిన రిజర్వేషన్లు మిగిలిన వారికి ఇవ్వగా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని తన లేఖలో కోరారు.
కాపులకు రిజర్వేషన్లు...
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలంటూ తాను గతంలో రాసిన లేఖలను కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కాపు జాతికి రిజర్వేషన్లు కల్పించి వచ్చే ఎన్నికల్లో వారిని అనుకూలంగా మలచుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమ ఇష్టం వచ్చినట్లు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయవచ్చని చెప్పిన నేపథ్యంలో ఈ లేఖ రాస్తున్నానని ఆయన తెలిపారు. 2019 ఎన్నికల్లో కాపు జాతి మీకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు.