అమరావతిలో పేదల ఇళ్ల స్థలాలపై మంత్రి నారాయణ ఏమన్నారంటే?

రాజధాని అమరావతిలో పేదల ఇళ్ల స్థలాలపై మున్సిపల్ మంత్రి నారాయణ స్పందించారు

Update: 2024-06-19 13:21 GMT

రాజధాని అమరావతిలో పేదల ఇళ్ల స్థలాలపై మున్సిపల్ మంత్రి నారాయణ స్పందించారు. గత ప్రభుత్వం రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలను ఇచ్చిందని, ఆ అంశం సుప్రీంకోర్టులో ఉందని, న్యాయసలహా తీసుకు వెళతామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజధానిలో సామాగ్రిని దొంగిలించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాజధానిలో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు ముందుగా కమిటీలు వేస్తామని తెలిపారు.

మరోసారి టెండర్లు...
గతంలో తమ ప్రభుత్వం పిలిచిన టెండర్ల కాలపరిమితి ముగిసినందున కొత్తగా అంచనాలను రూపొందించి టెండర్లను పిలవాల్సి ఉంటుందని మంత్రి నారాయణ చెప్పారు. టెండర్లను ఆహ్వానించేందుకు నాలుగైదు నెలల సమయం పడుతుందని ఆయన తెలిపారు. పనులు ఎప్పటి నుంచి ప్రారంభించాలన్న విషయం మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాజధాని నిర్మాణ పనులు వేగంగా సాగాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలను తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.


Tags:    

Similar News