Flash News : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి Naa Anveshana Youtuber -"అన్వేష్" సంచలన ఆరోపణలు..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఎన్నికలు గురించి అన్వేష్ సంచలన ఆరోపణలు.
Andhra Pradesh : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కంటే ముందుగా తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే తెలంగాణ ప్రజలకు సైతం తమ రాష్ట్ర ఎన్నికలకంటే ఆంధ్రా ఎన్నికల పై ఎక్కువ ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. ఈసారి ఏం జరుగుతుంది..? అక్కడ ఎవరు అధికారంలోకి వస్తున్నారు..? అని ఆసక్తిగా చూస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రా రాజకీయాలు అంత ఎంటర్టైన్మెంట్ గా మారాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఎన్నికలు గురించి ఎవరికి వారు.. వారి ఆలోచనలు తెలియజేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ ఏపీ రాజకీయాలు గురించి విదేశీ యాత్రికుడు 'అన్వేష్' సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం జింబాబ్వే దేశంలో ఉన్న అన్వేషి.. అక్కడ పరిస్థితులను పోలుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి ఏంటనేది తెలియజేసే ప్రయత్నం చేశారు. జింబాబ్వే దేశం ఒకప్పుడు ప్రజలకు అన్ని ఫ్రీగా అందించి.. ఇప్పుడు ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది.
జింబాబ్వే మాత్రమే కాదు వెనుజులా, సొమాలియా వంటి దేశాలు కూడా ఇదే సమస్యని ఎదుర్కున్నాయని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఫ్రీ పథకాలు వల్ల త్వరలో ఆంధ్రా కూడా అలా నష్టపోయే అవకాశం ఉందని, అది ప్రజలు గుర్తించాల్సి ఉందని చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడుతూ.. ఒక క్యాపిటల్ నిర్మించాలంటే 30 ఏళ్ళ సమయం పడుతుందని చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో కొత్త వ్యాపారాలు, కంపెనీలు వస్తేనే సంపాదన అనేది క్రియేట్ అవుతుంది. రెవిన్యూ క్రియేట్ అవ్వడం వల్ల భవిషత్తు అనేది బాగుంటుందని, ఫ్రీ పథకాలు వల్ల ఈరోజు కడుపు మాత్రమే నిడుతుందని అన్వేషి చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల సమయంలో జింబాబ్వేలా నాశనమైన వెనుజులా, సొమాలియా వంటి దేశాలు గురించి కూడా మీకు తెలియజేస్తాను. ఈసారి ఓటు వేసేటప్పుడు అలోచించి వేయమని చెబుతూ అన్వేషి రిలీజ్ చేసిన వీడియో ఒకసారి చూసేయండి.