Breaking : ఇద్దరు పేర్లు ఖరారు చేసిన జగన్
కర్నూలు పార్లమెంటు సభ్యుడిగా గుమ్మనూరు జయరాం పేరు ఖరారు చేశారు. ఆలూరు వైసీపీ ఇన్‌ఛార్జిగా విరూపాక్షను నియమించారు
కర్నూలు పార్లమెంటు సభ్యుడిగా గుమ్మనూరు జయరాం పేరు ఖరారు చేశారు. ఆలూరు వైసీపీ ఇన్‌ఛార్జిగా విరూపాక్షను నియమించారు. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆలూరు ఎమ్మెల్యేగా గత రెండు ఎన్నికల్లో గుమ్మనూరి జయరాం గెలుపొందారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుమ్మనూరి జయరాం పూర్తికాలం మంత్రి పదవిలో కొనసాగారు. బోయ కులానికి చెందిన గుమ్మనూరి జయరాంను కర్నూలు పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించారు.
ఇద్దరికీ చెప్పి...
అదే సమయంలో కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ పార్టీకి రాజీనామా చేసినట్లు ఇప్పటికే ప్రకటించారు. దీంతో గుమ్మనూరు జయరాం పేరును వెంటనే ఖరారు చేశారు. అదే సమయంలో ఆలూరు నియోజకవర్గం నుంచి విరూపాక్ష ను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వారిద్దరికీ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వారిద్దరికీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో కర్నూలు ఎంపీ, ఆలూరు ఎమ్మెల్యే పదవి విషయంలో పూర్తి క్లారిటీ వచ్చినట్లయింది.