చంద్రబాబు ప్రజల సొమ్మేమీ దోచుకోలేదు: నారా భువనేశ్వరి

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు దీక్షలు

Update: 2023-09-27 11:00 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు దీక్షలు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరంలో చేపట్టిన నిరసన దీక్షలో చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి పాల్గొన్నారు. చంద్రబాబు ప్రజల సొమ్మేమీ దోచుకోలేదు. అయినా జైల్లో నిర్బంధించారు. ఆయన కోసం మీరందరూ పోరాటానికి వచ్చారు. ప్రజల మనిషిని జైల్లో వేసి 19 రోజులైంది... ఏం తప్పు చేశారో ఒక్కటన్నా నిరూపించారా? అంటూ ప్రశ్నించారు భువనేశ్వరి. 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబుపై ఎన్నో కేసులు పెట్టారు, ఏ ఒక్కటైనా నిరూపించగలిగారా? సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండి ప్రజల కోసమే చంద్రబాబు పనిచేశారన్నారు. స్కిల్ డెవలెప్ మెంట్ సెంటర్ల ద్వారా 2 లక్షల మందికి పైగా యువతకు శిక్షణ ఇచ్చారన్నారు భువనేశ్వరి. టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు బిడ్డల్లాంటి వాళ్లు. కుటుంబ పెద్దను హింసించి జైల్లో పెడితే బిడ్డలు ఊరుకుంటారా? నిరసనలు తెలిపితే హత్యాయత్నం కేసులు పెడుతున్నారు. శాంతియుతంగా జరిగే నిరసనలపై పోలీసులు దాడులు చేస్తూ మహిళలను కూడా వ్యానుల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారని ఆరోపించారు భువనేశ్వరి.

చంద్రబాబును జైలుకు తరలించినప్పటి నుంచి ఆయన భార్య భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉంటున్నారు. ఆమె బుధవారం చర్చికి వెళ్లారు. రాజమండ్రి జాంపేటలోని సెయింట్‌ పాల్స్‌ లూథరన్‌ చర్చిలో నారా భువనేశ్వరి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్యాండిల్స్ వెలిగించి చంద్రబాబు త్వరగా బయటకు రావాలని కోరుకున్నారు. నారా భువనేశ్వరి రాక నేపథ్యంలో లూథరన్ చర్చిలో ఫాస్టర్లు ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.


Tags:    

Similar News