Nara Lokesh Red Book: రెడ్ బుక్ గురించి అదే చెప్పిన నారా లోకేష్

ఏపీ రాజకీయాల్లో రెడ్ గురించి చర్చ జరుగుతూ ఉంది

Update: 2024-07-27 02:57 GMT

ఏపీ రాజకీయాల్లో రెడ్ గురించి చర్చ జరుగుతూ ఉంది. ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ నేతలను ఇబ్బందులు పెట్టిన వ్యక్తులను అసలు విడిచిపెట్టేదే లేదని.. తాను వారందరి పేర్లు కూడా ఈ రెడ్ బుక్ లో రాశానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వైసీపీ నేతలపై దాడులు జరగడం గురించి తీవ్ర చర్చ జరుగుతూ ఉండగా నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.

రెడ్ బుక్ ఇంకా తెరవనే లేదని, అప్పుడే గగ్గోలు పెడుతున్నారన్నారు నారా లోకేష్. నా దగ్గర రెడ్ బుక్ ఉందని నేనే దాదాపు 90 బహిరంగ సభల్లో చెప్పాను. తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్ బుక్‌లో చేర్చి.. చట్టప్రకారం శిక్షిస్తామని చెప్పానన్నారు. ఇంకా రెడ్ బుక్ తెరవక ముందే జగన్ ఢిల్లీ వరకు వెళ్లి గగ్గోలు పెడుతున్నాడని మంత్రి లోకేష్ విమర్శలు గుప్పించారు. పీవీ నరసింహారావుకు భారతరత్నపై స్పందించమని జాతీయ మీడియా కోరితే విజయసాయిరెడ్డి పేరు చెప్పివెళ్లిపోయిన వైఎస్ జగన్.. రెడ్ బుక్‌కు మాత్రం జాతీయ మీడియా వెంటపడి బతిమాలి పిలిపించి మరీ ప్రచారం కల్పించాడన్నారు నారా లోకేష్.


Tags:    

Similar News