ఇది రైతు రాజ్యమా?

అన్నదాతలను ఇబ్బంది పెడుతున్న జగన్ ప్రభుత్వానికి రైతు సంక్షేమం గురించి మాట్లాడే హక్కు లేదని నారా లోకేష్ అన్నారు.

Update: 2021-12-23 07:42 GMT

అన్నదాతలను అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్న జగన్ ప్రభుత్వానికి రైతు సంక్షేమం గురించి మాట్లాడే హక్కు లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈరోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా నారా లోకేష్ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. రైతు రాజ్యం తెస్తానని చెప్పిన జగన్ అన్నదాతలేని రాష్ట్రంగా మార్చేశారని నారా లోకేష్ ఫైర్ అయ్యారు. కనీసం రైతులను ఈ రెండున్నరేళ్లలో పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు.

విత్తనాలను, ఎరువులను....
విత్తనాలు, ఎరువులను కూడా రైతులకు సరైన సమయంలో ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదని నారా లోకేష్ ఆరోపించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా కల్పించలేక పోతున్నారన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ ఆ తర్వాత రైతు సంక్షేమాన్ని విస్మరించారని చెప్పారు. రైతాంగం ఇప్పుడిప్పుడే జగన్ ప్రభుత్వ వైఖరిని అర్థం చేసుకుంటున్నారన్నారు.


Tags:    

Similar News