‍‍Nara Lokesh : రేపు ఛాంబర్ లోకి ప్రవేశించనున్న నారా లోకేష్

రేపు మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయం నాలుగో బ్లాక్ లోని ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టనున్నారు

Update: 2024-06-23 12:00 GMT

రేపు మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకూ నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించలేదు. రేపు మంత్రి వర్గ సమావేశం కూడా ఉండటంతో ఆయన పదవీ బాధ్యలను సచివాలయంలో చేపట్టనున్నారు. ఇప్పటి వరకూ బాధ్యతలను చేపట్టక పోవడానికి ఆయన ఛాంబర్ లో స్వల్ప మార్పులు చేర్పులు చేయడం వల్లననేని చెబుతున్నారు.

స్వల్ప మార్పులు చేయాల్సి రావడంతో...
రేపు ఉదయం 9.45 గంటలకు నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయం నాలుగో బ్లాక్ లోని ఛాంబర్ ను లోకేష్ కోసం కేటాయించారు. అందులో మార్పులు చేర్పులు పూర్తి కావడంతో రేపు లోకేష్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇప్పటివరకూ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఉంటూ విధులను నిర్వహిస్తున్నారు.


Tags:    

Similar News