వైసీపీ కంచుకోటలో నారా లోకేష్

మంగళవారం సాయంత్రం 4గంటలకు జమ్మలమడుగు శివారులోని విడిది కేంద్రం నుంచి 111వ రోజు పాదయాత్ర మొదలవుతుంది.

Update: 2023-05-30 03:13 GMT

నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు తిరిగి ప్రారంభం కానుంది. అది కూడా వైసీపీ కంచుకోటలో పాదయాత్ర సాగనుంది. ఈ నెల 23న లోకేశ్‌ పాదయాత్ర జమ్మలమడుగు మండలంలోని పెద్దముడియం మండలం చేరింది. 24, 25 తేదీల్లో లోకేశ్‌ పాదయాత్ర నిర్వహించారు. మహానాడు కారణంగా నాలుగురోజులు పాదయాత్రకు విరామం ఇచ్చారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో సోమవారం సాయంత్రం కడప విమానాశ్రయం చేరుకున్నారు నారా లోకేష్. టీడీపీ నాయకులూ లోకేశ్‌కు విమానా శ్రయంలో స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన రోడ్డుమార్గాన జమ్మలమడుగు శివారులో ఏర్పాటు చేసిన విడిదికేంద్రానికి చేరుకుని బస చేశారు. యువగళం పాదయాత్ర ఇప్పటి వరకు 110 రోజులు సాగింది. 1,423.7 కి.మీ మేర లోకేశ్‌ నడిచారు. మంగళవారం సాయంత్రం 4గంటలకు జమ్మలమడుగు శివారులోని విడిది కేంద్రం నుంచి 111వ రోజు పాదయాత్ర మొదలవుతుంది. 4.20కి పెద్దపసుపుల మోటు వద్ద స్థానికులతో లోకేశ్‌ మాటామంతి ఉంటుంది. 4.30కి సంజామల మోటు వద్ద బహిరంగసభ, 5.45కు జమ్మలమడుగు పాతబస్టాండు గాంఽధీ విగ్రహుం వద్ద స్థానికులతో మాటా మంతి, 6.15కు కన్నెలూరు క్రాస్‌ వద్ద స్థానికులతో సమావేశం, 8.15కు ధర్మవరం క్రాస్‌ వద్ద స్థానికులతో మాటామంతి, 9గంటలకు శేశారెడ్డిపల్లె పాలకోవ సెంటరులో స్థానికులతో మాటామంతి, 9.30కు దేవగుడి సుంకుంలాంబ దేవాలయం వద్ద విడిది కేంద్రంలో బస ఉంటుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.

రాజ‌మండ్రిలో జ‌రిగిన మ‌హానాడు వేదిక‌పై నారా లోకేష్ చేసిన వ్యాఖ్య‌లు సంచలనంగా మారాయి. ప్ర‌ధానంగా రెండు విష‌యాల‌ను నారా లోకేష్ చ‌ర్చించారు. టికెట్ల‌పై ఆశ పెట్టుకోకుండా ప‌నిచేయాల‌ని నారా లోకేష్ సూచించారు. అలాగే వైసీపీ నుంచి ఎవ‌రు వ‌చ్చినా తీసుకునేందుకు టికెట్లు ఇచ్చేందుకు సిద్ధంగా లేమ‌ని చెప్పారు. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారిపోయాయి.


Tags:    

Similar News