నారా లోకేష్ @ 400 కి.మీ
నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు చంద్రగిరి నియోజవకర్గంలో 31వ రోజు సాగుతుంది
తనను చూస్తే ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు వణుకు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గతంలో వైఎస్సార్, షర్మిల పాదయాత్రలు చేసినా ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదని, కానీ తన పాదయాత్రను మాత్రం అడుగడుగునా అడ్డుకుంటున్నారని నారా లోకేష్ అన్నారు. తన మైక్, కుర్చీ లాక్కున్నా వెనక్కు తగ్గనని, తన గళం ఆగదని లోకేష్ తెలిపారు. తనపై ఇప్పటికే ఇరవై కేసులు నమోు చేశారన్నారు. జగన్ పనిఅయిపోయిందని ఆయన అన్నారు.
నన్ను చూస్తే జగన్‌కు వణుకు...
నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు చంద్రగిరి నియోజవకర్గంలో 31వ రోజు సాగుతుంది. ఈరోజు నాలుగు వందల కిలోమీటర్ల పాదయాతర పూర్తవుతున్న సందర్భంగా నేండ్రగుంట వద్ద శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించారు. అనంతరం నేండ్రగుంట గ్రామస్థులతో ముఖాముఖి పాల్గొన్నారు. అనంతరం ఇర్రంగారి పల్లిలో యువతతో సమావేశమయ్యే లోకేష్ ఆ తర్వాత పాకాల గ్రామంలో టైలర్లతో నారాలోకేష్ మాటా మంతీ కార్యక్రమంలో పాల్గొంటారు. పాకాల పూల మార్కెట్ వద్ద లోకేష్ వ్యాపారులతో ముచ్చటిస్తారు. అక్కడ ఉన్న మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.