టీడీపీ నేత ముందస్తు అరెస్ట్

నరసరావుపేట టీడీపీ ఇన్‌ఛార్జి చదలవాడ అరవింద్ బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Update: 2023-03-22 03:32 GMT

నరసరావుపేట టీడీపీ ఇన్‌ఛార్జి చదలవాడ అరవింద్ బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నరసరావు పేట అభివృద్ధిపై ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చదలవాడ అరవిందబాబులు సవాళ్లు విసురుకున్న నేపథ్యంలో ఆయనను ఇంటి నుంచి బయటకు కదలకుండా పోలీసులు అడ్డుకున్నారు. కోటప్పకొండకు చర్చకు రావాలని సవాళ్లు విసురుకున్నారు. 

నరసరావు పేటఅభివృద్థిపై...
నరసరావుపేట అభివృద్థి ఏమాత్రం జరగలేదని అరవింద్ బాబు అంటుండగా, దమ్ముంటే తనతో చర్చకు రావాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో నరసరావుపేటలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మొహరించారు. కోటప్పకొండకు వెళ్లకుండా చదలవాడ అరవిందబాబును పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.


Tags:    

Similar News