ఏపీకి భారీ జరిమానా.. 120 కోట్లు చెల్లించాల్సిందే
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ జరిమానాను విధించింది.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ జరిమానాను విధించింది. 120 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించినందున ఈ ఈ జరిమానాను మూడు నెలల్లో చెల్లించాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఏపీ సర్కార్ ను ఆదేశించింది. ఈ జరిమానాను ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి చెల్లించాలని కూడా సూచించింది. గతంలో పర్యావరణ అనుమతులను ఉల్లంఘించి నిర్మాణాలను చేపట్టినందున ఈ జరిమానాను విధించామని చెప్పింది.
ఈ ఎత్తిపోతల పథకాలకు?
పోలవరం ప్రాజెక్టు పరిధిలోని పోలవరం ప్రాజెక్టు పరిధి కింద నిర్మిస్తున్న పురుషోత్తం పట్నం ఎత్తిపోతల పథకానికి 24,56 కోట్లు, పట్టీసీమ పథకానికి 24,90 కోట్లు, చింతలపూడి ఎత్తిపోతల పథకానికి 73.6 కోట్లు చెల్లించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. జరిమానా నిధులను వినియోగించడంపై ఏపీ పీసీబీ, సీపీసీబీ సభ్యులతో ఒక కమిటీని కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నియమించింది.