కబడ్డీ.. కబడ్డీ... కూత పెట్టిన రోజా
తిరుపతిలో జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంటు జరుగుతోంది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా కబడ్డీ ఆడి అందరిని అలరించారు
తిరుపతిలో జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంటు జరుగుతోంది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా కబడ్డీ ఆడి అందరిని అలరించారు. జాతీయ స్థాయి క్రీడలను తిరుపతిలో నిర్వహించడం గర్వకారణమని రోజా అభిప్రాయపడ్డారు. ఆటలతో ఆరోగ్యం మరింత పెరుగుపడుతుందని అన్నారు.
క్రీడలు ఆరోగ్యానికి....
ఈ కార్యక్రమంలో రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తిరుపతిని క్రీడలకు కేంద్రంగా తయారు చేస్తామని ఆయన చెప్పారు. అలాగే ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతికి క్రీడలతో కొత్త సొబగులు వచ్చాయనిఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి ఎంపీ ఈ క్రీడలను నిర్వహణపై భూమన కరుణాకర్ రెడ్డి చూపిన చొరవ ప్రశంసనీయమన్నారు. మూడోరోజు కబడ్డీ పాటీలు తిరుపతిలో జరుగుతున్నాయి.