నేడు దుర్గామాతగా అమ్మవారు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నవరత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు

Update: 2024-10-10 02:30 GMT

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నవరత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారు జామునుంచే దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. నేడు ఎరుగు రంగు వస్త్రాలను అమ్మవారికి అలంకరించాలని, పులగం, పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలని చెబుతారు. దుర్గాష్టమి రోజున అమ్మవారిని పూజిస్తే సకల సౌభాగ్యాలతో పాటు ఆయురారోగ్యాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.

అత్యంత విశిష్టమైనదిగా...
దేవీ నవరాత్రుల్లో అత్యంత విశిష్టమైన రోజుగా భావిస్తారు. కుంకుమతోనే అమ్మవారిని పూజిస్తారు. ఈరోజు దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్దయెత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వచ్చారు. క్యూ లైన్లన్నీ ఉదయం నుంచే నిండిపోయాయి. క్యూ లైన్ లో ఉన్న భక్తులు ఇబ్బంది పడకుండా పోలీసులు, సిబ్బంది అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మంచినీరు, మజ్జిగ వంటివి సరఫరా చేస్తున్నారు. ఆలయంలో దర్శనం అందరికీ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.


Tags:    

Similar News