TDP : తమ్ముళ్లూ.. ఇదిగిదిగో గుడ్ న్యూస్... ఇక పదవులు చేపట్టేందుకు సిద్ధం కండి

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.

Update: 2024-08-11 13:42 GMT

tdp, candidate, mlc of local bodies, visakha district

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు ముహూర్తం కూడా ఖరారయినట్లు సమాచారం. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీనియర్ నేతలతో చర్చించారు. జిల్లాల నుంచి ఆశావహుల పేర్లను తెప్పించుకుని అందులో వడపోతను చేపట్టారు. శని, ఆదివారాల్లో ఆయన హైదరాబాద్ లో ఈ వడపోత కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కావస్తుండటంతో ఇక ఆలస్యం చేయకుండా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.

నామినేటెడ్ పోస్టులను...
నామినేటెడ్ పోస్టులను ఈ నెల 16వ తేదీ నుంచి భర్తీ చేయాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది.రాష్ట్రంలో దాదాపు 90 కార్పొరేషన్లు, వివిధ సంస్థలు ఉండగా వాటికి ఛైర్మన్లను, పాలకవర్గ సభ్యులను నియమించాల్సి ఉంది. ఇందులో నలభై వరకు భర్తీ చేయొచ్చని తెలుస్తోంది. అయితే నామినేటెడ్ పోస్టుల్లో ఎక్కువ భాగం గత ఎన్నికల్లో సీట్లు రాని ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజక వర్గ ఇన్‌ఛార్జులకు ఇవ్వాలని ప్రాధమికంగా చంద్రబాబు నిర్ణయించారని చెబుతున్నారు. మొత్తం నామినేటెడ్ పదవుల్లో 60 శాతం టీడీపీ, 30 శాతం జనసేన,10 శాతం బీజేపీకి దక్కనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ నెల 16వ తేదీన తెలుగు తమ్ముళ్లకు పండగ పండగ.


Tags:    

Similar News