ఎమ్మెల్యే కోటంరెడ్డికి భద్రత తగ్గింపు
నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రభుత్వం భద్రతను తగ్గించింది
నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రభుత్వం భద్రతను తగ్గించింది. 2 + 2 భద్రతను 1 + 1కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా....
ఆనం రామనారాయణరెడ్డికి కూడా భద్రతను తగ్గించారు. ఇప్పుడు కోటంరెడ్డి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తడంతో ఆయనకు భద్రత తగ్గించారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన భద్రతను ఎలా కుదిస్తారన్న ప్రశ్న వారి నుంచి వస్తుంది. కోటంరెడ్డి ఇటీవల తాను టీడీపీలో చేరుతున్నానని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నెల్లూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సమన్వయ కర్తగా వైసీపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించింది.