Andhra Pradesh : పేదోడికి గుడ్ న్యూస్... రెడీ కానున్న అన్న కాంటిన్లు
అన్న క్యాంటీన్ లు పునరుద్ధరణకు కొత్తగా ఏర్పాటయిన ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
అన్న క్యాంటీన్ లు పునరుద్ధరణకు కొత్తగా ఏర్పాటయిన ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే అన్నా కాంటిన్ల పునరుద్ధరణ ఫైలుపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. త్వరితగతిన అన్నా కాంటిన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదల ఆకలిని తీర్చేందుకు వీలయినంత త్వరగా అన్న కాంటిన్లను అందుబాటులోకి తేవాలని ప్రయత్నితస్తుంది. ఇందులో భాగంగా రూ.189 కోట్ల రూపాయలు అవసరమని మున్సిపల్ శాఖ అంచనా వేసింది.
అనుమతి రాగానే...
ఆర్థికశాఖకు పంపిన ప్రతిపాదనలకు ఆమోదం రాగానే పనులు ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. తొలి దశలో 183 క్యాంటీన్ల పునరుద్ధరణకు రూ.189.22 కోట్లు అవసరమని ఇంజినీర్లు అంచనాలు వేసి ఆర్థికశాఖకు నిధుల కోసం ప్రతిపాదించారు. ఆర్థిక శాఖ నుంచి నేడో, రేపో అనుమతి లభించిన వెంటనే అన్నా కాంటిన్లు పునరుద్ధిరించేందుకు ప్రభుత్వం సిద్ధమయిందని మున్సిపల్ శాఖ అధికారులు తెలిపారు. అన్నా కాంటిన్లలో ఐదు రూపాయలకే భోజనం అందించనున్నారు.