Andhra Pradesh : తక్షణమే వాటిని నిలిపేయండి.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అన్ని శాఖలకు కీలక ఆదేశాలను జారీ చేసింది.

Update: 2024-06-18 03:31 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అన్ని శాఖలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. 2019 సంవత్సరానికి ప్రవేశపెట్టిన పథకాలకు నేటికీ కొనసాగుతున్నట్లయితే వాటికి పాత పేర్లను పెట్టాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పాత పేర్లతోనే ఆ పథకాలను లబ్దిదారులకు అందించాలని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.

పాత పథకాలకు...
అలాగే పాత పథకాలకు 2019 నుంచి 2024 మధ్య కాలంలో అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పేర్లను తొలగించాలని కూడా పేర్కొంది. తర్వాత ఆదేశాలు జారీ అయ్యే వరకూ పేర్లు లేకుండానే పథకాలు లబ్దిదారులకు అందించాలని పేర్కొంది. పార్టీ రంగులు, జెండాలతో ఉన్న పాస్ పుస్తకాలతో పాటు, కార్డులు, సర్టిఫికేట్ల జారీని తక్షణమే నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.


Tags:    

Similar News